కేసీఆర్ సర్కారుకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రైతు బంధు పంపిణీకి అడ్డుకట్ట వేసింది. దీంతో రైతుల ఖాతాల్లో వేయడానికి సిద్ధమైన సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ అన్నదాతలకు రైతు బంధు పంపిణీకి రెండు రోజుల క్రితం సీఈసీ అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయం సర్కారుకు అనుకూలమన్న విమర్శలు వచ్చాయి. కేంద్రం ఒత్తిడితోనే సీఈసీ రైతు బంధుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. తెలంగాణ ఎన్నికల్లో రైతుబంధు చుట్టూ రాజకీయం అల్లుకుంది. అన్నదాతల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పార్టీల మధ్య వాగ్యుద్ధం సాగింది. కేసీఆర్ సర్కారు సీజన్ వారీగా రైతులక పెట్టుబడి సాయం అందిస్తోంది. తెలంగాణలో మొత్తం 70 లక్షల మంది రైతులు ఉన్నారు. వారి ఖాతాల్లోకి 7,700 కోట్ల రూపాయలు జమ చే్స్తోంది. తెలంగాణలో ఎక్కువగా ఉన్నది రైతుల ఓట్లే. పోలింగ్ కు కొన్ని రోజుల ముందు ఒకటిక కాదు, రెండు కాదు… ఏకంగా 7,700 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వెళ్లున్నాయనగానే బీఆర్ఎస్ లో ఆనందం, కాంగ్రెస్ లో ఆందోళన వ్యక్తమైంది. ఇది కచ్చింతంగా తెలంగాణ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ అవుతుందని కాంగ్రెస్ ఆందోళన చెందింది. తెలంగాణలో ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరిన ఈ సమయంలో ఈ నిర్ణయం వెలువడింది. ప్రధాన పార్టీలు హోరా హోరీగా తల పడుతున్నాయి. కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ కొనసాగుతోంది. కాంగ్రెస్ తమదే అధికారం అనే ధీమాతో ఉంది. ఈ సమయంలోనే దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు జమకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుమతి లభించడంతో ఎన్నిక కీలక మలుపు తిరుగుతుందని భావించారు. ఈ నిధులను ఈనెల 28లోగా జమ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే కాంగ్రెస్ లో ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా తల పడుతున్నాయి. ఈ సమయంలో ఏకంగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధుల జమ అంశం కొత్త చర్చకు దారి తీసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉందనే ప్రచారం వేళ ఈ నిధుల విడుదల ద్వారా ఏం జరుగుతుందనేది కీలకంగా మారింది. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం రైతు బంధు విషయంలో పునరాలోచన చేసింది. ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకుంది.
కేసీఆర్ సర్కారుకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్..!
62