మంత్రి కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు

Advertisements

&NewLine;<p>మంత్రి కేటీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది&period; కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రణ్‌దీప్ సూర్జేవాలా ఫిర్యాదు చేయడంతో ఈసీ నోటీసులు పంపించింది&period; టీ వర్క్స్‌లో స్టూడెంట్ ట్రైబ్‌ భేటీలో చేసిన వ్యాఖ్యలపై సూర్జేవాలా ఫిర్యాదు చేశారు&period; ఆ వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులలో పేర్కొంది&period; ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీ వర్క్స్ భేటీలో విద్యార్థులకు కేటీఆర్ హామీ ఇచ్చారని&comma; అలాగే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కూడా చెప్పారని&comma; తద్వారా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ కార్యాలయం టీ వర్క్స్‌ను ఉపయోగించుకున్నారని సూర్జేవాలా ఫిర్యాదులో పేర్కొన్నారు&period; ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ… కేటీఆర్ ప్రాథమిక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది&period; రేపు మధ్యాహ్నం మూడు గంటల లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.