టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మూడురోజుల పర్యటన ఖరారయ్యింది. 28వ తేదీ హైదరాబాద్ నుండి బెంగళూరు చేరుకొని అక్కడ కాడుగుడి హాస్పిటల్ నందు అనారోగ్యంతో ఉన్న కుప్పం మున్సిపల్ టీడీపీ నాయకుడు త్రిలోక్ ని పరామర్శిస్తారు. అక్కడి నుండి రోడ్డుమర్గంలో గుడుపల్లి చేరుకొని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం కుప్పం పార్టీ కార్యాలయానికి చేరుకొని పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న తన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ఇంటికి వెళ్లి పరామర్శించిన అనంతరం స్థానిక R&B అతిధి గృహంలో బస చేయనున్నారు. రెండో రోజు ఉదయం 9గంటలకు R&B అతిధి గృహం వద్ద ప్రజలనుండి వినతులు స్వీకరిస్తారు .11.50గంటలకు శాంతిపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద భాహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడినుండి రామకుప్పం కి చేరుకొని పోలీస్ స్టేషన్ సర్కిల్ లో సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుండి కుప్పం బైపాస్ రోడ్డులోని mm మహల్ కి చేరుకొని పార్టీ నాయకులతో సమావేశం అవుతారు అక్కడినుండి మండల వారీగా కుప్పం లోని BCN కల్యాణ మండపనికి చేరుకొని సమీక్ష నిర్వహిస్తారు. సమావేశం ముగిసినతరువాత రాత్రికి R&B అతిథి గృహానికి చేరుకొని బస చేస్తారు. 30వ తేదీ ఉదయం ప్రజలనుండి వినతులు స్వీకరిస్తారు అనంతరం 12గంటలకు pes మెడికల్ కాలేజీ వద్ద కురభ భవనం వద్ద శ్రీ కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు అనంతరం కురభ కులస్థులతో సమావేశం అవుతారు. అక్కడినుండి మధ్యాహ్నం 2.30 కి కుప్పం బస్ట్ స్టాండ్ లోని అన్నా కాంటీన్ లో పేదలకు అన్నదానం చేస్తారు అక్కడినుండి కొత్తపేట ఉన్న పెద్దపల్లి గంగమ్మ ఆలయానికి వెళ్లి పూజలు చేసిన అనంతరం మజీద్ కు పెళ్లి ప్రతేక ప్రార్థనలు చేస్తారు. అక్కడినుండి మాల్లనూరు బస్సు స్టాండ్ వద్దకి చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉదేశించి మాట్లాడతారు అనంతరం అక్కడినుండి రోడ్డుమర్గంలో బెంగళూరు HAL ఎయిర్పోర్ట్ కి చేరుకొని హైదరాబాదుకు వెళ్తారు.
రేపటి నుంచి కుప్పంలో చంద్రబాబు టూర్
103
previous post