81
హైదరాబాద్ లో మొన్నటి దాకా భారీగా ఉన్న చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గత 20 రోజుల వ్యవధిలో చికెన్ ధరలు ఏకంగా 22 శాతం తగ్గాయి. నవంబర్ 3న లైవ్ చికెన్ కిలో ధర రూ. 140ఉండగా ఇప్పుడు ధర రూ. 126కు పడిపోయింది. స్కిన్, వితౌట్ స్కిన్, బోన్ లెస్ చికెన్ ధరల్లో కూడా తగ్గుదల ఇదేమాదిరి ఉంది. అక్టోబర్ 29న కార్తీక మాసం ప్రారంభమయిన సంగతి తెలిసిందే. హిందూ మతానికి చెందిన ఎంతో మంది ఈ మాసాన్ని పవిత్రంగా భావిస్తుంటారు. మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనికి తోడు, లక్షలాది మంది అయ్యప్ప దీక్ష తీసుకుంటుండటంతో వారు కూడా మాంసాహారానికి దూరంగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయని భావిస్తున్నారు.