సాధారణంగా చాలా మంది చికెన్, మటన్ లేదా చేపలు వంటి ఆహారాలను ఇష్టంగా తింటారు. రొయ్యలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. రొయ్యలలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అనేకంగా ఉంటాయి. ముఖ్యంగా మనలో చాలా మందికి విటమిన్ బి12 లోపం ఏర్పడుతుంటుంది. అలాంటి వారు వారంలో రెండు సార్లు రొయ్యలను తినాలి. దీంతో ఈ లోపం నుంచి బయట పడవచ్చు. ఇంకా ఎన్నో లాభాలు మనకు రొయ్యల వల్ల కలుగుతాయి. రొయ్యలు తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. రొయ్యల్లో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. రొయ్యలలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటి వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మంది మతిమరుపుతో బాధపడుతుంటారు. అలాంటి వారు రొయ్యలు తింటే మంచిది. మతిమరుపు సులభంగా పోతుంది. రొయ్యలు తినటం వలన శరీరానికి కావల్సిన క్యాల్షియం అందుతుంది. రొయ్యల్లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. వీటిని తినటం వలన చర్మం నిగనిగలాడిపోతుంది. కాంతివంతంగా మారుతుంది. రొయ్యల్లో విటమిన్ బీ12 ఉంటుంది. దీని వలన రక్తనాళాలు శుభ్రపడతాయి. బరువు తగ్గాలి అనుకునేవారు రొయ్యల్ని తరుచూ తినటం వలన మంచి ఫలితం ఉంటుంది. రొయ్యల్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. దీంతో కండరాలు బలపడతాయి. రొయ్యల్లో ఉండే జింక్ మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. వీర్య కణాల సంఖ్యను పెంచటానికి రొయ్యలు సహాయ పడతాయి.
Chicken
చాలామంది రోజంతా కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్ స్క్రీన్లు చూస్తూ ఉంటారు. దీనివల్ల కంటి చూపు బలహీనపడటం మొదలవుతుంది. ఇక వయస్సు పెరుగుతుంటే కూడా కంటి చూపు మందగిస్తుంది. కంటి సమస్య ఎక్కువైన తర్వాత ఆస్పత్రుల బాట పడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా కంప్యూటర్ల ముందు పనిచేసేవారు మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ఏం చెయ్యాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం. ప్రతీరోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగటం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. క్యారెట్ లో ఉండే పోషకాలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చేపలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మరో మంచి ఆహారం. చేపలలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక మన ఆహారంలో ఆకుకూరలు చేర్చుకుంటే కూడా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బచ్చలికూర వంటి ఆకుకూరలు కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. కంటి ఆరోగ్యం కోసం ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల విషయానికి వస్తే సిట్రస్ పండ్లలో కంటి ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఉంటాయి. బత్తాయి, నారింజ వంటి పండ్లలో కంటికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. నారింజ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి. మనం తీసుకునే ఆహారంలో టమాటాలను చేరిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. టమాటాలలో మన కంటి చూపును కాపాడే లైకోపీన్ ఉంటుంది. ఈ ఆహారాలను కంటి చూపును మెరుగుపరచుకోవటం తీసుకోవటంతో పాటు కంప్యూటర్ల ముందు పని చేసేవారు గంటకో మారు బ్రేక్ తీసుకుని చిన్న చిన్న కళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజులు చెయ్యటం మంచిది.కంటి ఆరోగ్యాన్ని బాదం పప్పు బాగా పెంచుతుంది. బాదం పప్పు నానబెట్టి నిత్యం రెండు పప్పులు తినటం కంటికి మేలు చేస్తుంది. గ్రుడ్లు, చికెన్ కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన ఆహరం. గ్రుడ్లలో జింక్, విటమిన్ ఏ ఉంటుంది. ఇది కళ్ళకు మేలు చేస్తుంది. చికెన్ లో ఉండే ప్రోటీన్ కంటి ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను ఇస్తుంది.
Read Also..
Read Also..
హైదరాబాద్ లో మొన్నటి దాకా భారీగా ఉన్న చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గత 20 రోజుల వ్యవధిలో చికెన్ ధరలు ఏకంగా 22 శాతం తగ్గాయి. నవంబర్ 3న లైవ్ చికెన్ కిలో ధర రూ. 140ఉండగా ఇప్పుడు ధర రూ. 126కు పడిపోయింది. స్కిన్, వితౌట్ స్కిన్, బోన్ లెస్ చికెన్ ధరల్లో కూడా తగ్గుదల ఇదేమాదిరి ఉంది. అక్టోబర్ 29న కార్తీక మాసం ప్రారంభమయిన సంగతి తెలిసిందే. హిందూ మతానికి చెందిన ఎంతో మంది ఈ మాసాన్ని పవిత్రంగా భావిస్తుంటారు. మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనికి తోడు, లక్షలాది మంది అయ్యప్ప దీక్ష తీసుకుంటుండటంతో వారు కూడా మాంసాహారానికి దూరంగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయని భావిస్తున్నారు.






Total views : 199181