65
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో భారతదేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి బుద్ద ప్రసాద్ మాట్లాడుతూ జహార్ లాల్ నెహ్రూ భారతదేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఆయన జన్మదినం రోజున బాలల దినోత్సవం జరుపుకుంటాం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమాలకు విచ్చేసిన చిన్నారులు, పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి ఆనందంగా గడిపారు. అనంతరం జహార్ లాల్ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.