71
తిరుమలలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చంద్రబాబును కలవడానికి వచ్చిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీనివాస్ ను పోలీసులు అడ్డుకున్నారు. తమ నేతను కలవడానికి వస్తే ఎలా ఆపుతారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని పోలీసులపై మండిపడ్డారు. భద్రత కారణాల రీత్యా అడ్డుకున్నామని అర్థం చేసుకోవాలంటూ పోలీసుల సర్దిచెప్పారు. ఎట్టకేలకు చంద్రబాబును కలిసేందుకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ కు పోలీసులు అనుమతినిచ్చారు.