71
మార్కాపురం నెహ్రు బజార్ లోని విజయలక్ష్మి క్లినికల్ & బయో కెమికల్ లాబరేటరీ యజమాని తాడి కేశవ ల్యాబ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు తాడి కేశవ జిల్లా ఏరియా ఆసుపత్రి లో కాంటాక్ట్ బేసిక్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వర్తించే వాడు. విధులనుండి తొలగించడంతో ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.