78
బజార్ ఘాట్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనాస్థలంలో మరోసారి క్లూస్ టీం.. ఫోరెన్సిక్ టీం.. ఎంటరై ఆధారాలు సేకరిస్తున్నాయి. రోడ్డుపై ఆయిల్ పారుతూ ఉండడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది మట్టి పోసింది. బిల్డింగ్‌లోని మిగిలిన ఆయిల్ డ్రమ్ములను జీహెచ్ఎంసీ బయటకి తరలించింది. మరోవైపు బిల్డింగ్ పట్టిష్టతను జేఎన్‌టీయూ బృందం పరిశీలించనుంది. అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్‌మెంటుకు దగ్గరలో రమేష్ జైస్వాల్ షాప్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. షాప్‌లో రికార్డులను తనిఖీ చేయడంతోపాటు కార్యకలాపాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.