94
ఏపీ సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. సీఎం జగన్ అర్ధాంగి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు కూడా నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎంతో పాటు నివాళులు అర్పించిన వారిలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎంపీ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం జగన్ నివాళులు అర్పించిన అనంతరం ఇడుపులపాయ ప్రార్థనా మందిరంలో ప్రార్థనలకు హాజరయ్యారు. సీఎం జగన్ ప్రతి ఏడాది క్రిస్మస్ కు ఇడుపులపాయ వస్తారని తెలిసిందే. రేపు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే ప్రార్థనలకు హాజరుకానున్నారు.