పరిపాలన చేతకాని సీఎం….

Sujay Krishna who supported the struggle of Anganwadis

Advertisements

&NewLine;<p>అంగన్వాడీల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు&period; అంగన్వాడీల పోరాటానికి శుక్రవారం మాజీమంత్రి&comma; టీడీపీ నాయకులు మద్దతు ప్రకటించారు&period; అంగన్వాడీల నిరసన శిబిరాన్ని టీడీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సందర్శించి మద్దతు ప్రకటించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో లబ్ది కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకపోవడం అన్యాయమన్నారు&period; ఎన్నికల హామీను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం&comma; ముఖ్యమంత్రిపై ఉందన్నారు&period; ఐదేళ్ల సమయం లో అంగన్వాడీల సమస్యను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు&period; తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రాని సీఎం ఎన్నికల్లో బయటకు రావడం తప్పనిసరి అని తెలిసి అంగన్వాడీలు బయటకు వచ్చారన్నారు&period; ఇసుక అక్రమ తవ్వకాలు&comma; జగనన్న కాలనీ పేరుతో ముఖ్యమంత్రి&comma; మంత్రులు జేబులు నింపుకొంటున్నారని విమర్శించారు&period; సీఎం జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకదాని ఆరోపించారు&period; దోపిడీని ఆపితే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించవచ్చునన్నారు&period; ప్రజలు&comma; ఉద్యోగులు&comma; కార్మికులు&comma; రైతుల్లో అసంతృప్తి వచ్చిందన్నారు&period; అంగన్వాడీలు&comma; మున్సిపల్&comma; సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సహకరించకుండా ఐదేళ్లు పాలన చేశారా అని ప్రశ్నించారు&period; అంగన్వాడీలను తొలగించే హక్కు ఎవరికి లేదన్నారు&period; అంగన్వాడీలకు టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు&period; ఒక్కసారి మోస పోవడం సహజం రెండోసారి మోసపోకుండా వైసీపీకు బుద్ది చెప్పాలని కోరారు&period; రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు&period; మూడు నెలల్లో టీడీపీ ప్రభుత్వం అధికారం లోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.