జిల్లాల రీ ఆర్గనైజేషన్ కు త్వరలో కమిషన్..

Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు&period; జిల్లాల రీ ఆర్గనైజేషన్ కు త్వరలో కమిషన్ వేస్తామని వెల్లడించారు&period; హైకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన కమిషన్ వేస్తామని చెప్పారు&period; తెలంగాణ అంతటా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు&period; నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తీరులా చేస్తామని స్పష్టత ఇచ్చారు&period; కచ్చితమైన ప్రాతిపదికతో జిల్లాలు మారుస్తామన్నారు&period; డీవియేషన్ ఉండొచ్చు&comma; వయోలేషన్ ఉండొద్దు కదా అని రేవంత్ ఓ కార్యక్రమంలో ప్రశ్నించారు&period; జిల్లాల ఏర్పాటు విషయంలో కేసీఆర్ సరైన విధానం అవలంబించ లేదన్నారు&period; ఎడాపెడా జిల్లాలను పెంచేశారని రేవంత్ విమర్శించారు&period; అదెలా ఉందంటే&period;&period; ఆ జిల్లాల పేర్లను కూడా కేసీఆర్ చెప్పలేరని ఎద్దేవా చేశారు&period; మూడు మండలాలకు ఓ జిల్లా చేశారని సీఎం వివరించారు&period; ఉదాహరణకు మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం ఏడు జిల్లాల పరిధిలో ఉందన్న రేవంత్&period;&period; అక్కడి ఎంపీ ఏడుగురు కలెక్టర్లతో మాట్లాడాలా అని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.