మొండా మార్కెట్ లోని ఇందిరాగాంధీ విగ్రహం ముందు,బన్సీలాల్ పేట్ లో ని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రచార హోర్డింగుల ను నిలిపి ఇందిరాగాంధీ కి అవమానం చేశారని సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోర్డింగ్ లు తక్షణమే తీసేసి, అవి పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని నీలిమ తో పాటు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇందిరా గాంధీ విగ్రహం ముందు కు పెద్దఎత్తున చేరుకుని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు.రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాల వద్ద బిఆర్ఎస్ నాయకుల హోర్డింగ్ లు పెట్టిన వారిపై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసే వరకు తమ సత్యాగ్రహ ఆందోళన కొనసాగిస్తామని కోట నీలిమ ప్రకటించారు.
మొండా మార్కెట్ లో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన..
71
previous post