తొలిసారి తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌ పతాకం…

Congress flag

Advertisements

&NewLine;<p>తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌ పతాకం తొలిసారి రెపరెపలాడింది&period; ఉద్యమ పార్టీ బీ ఆర్ ఎస్ ను ఓడించి అధికారంలోకి వచ్చింది&period; గతంలో ప్రభుత్వం ఇచ్చిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు&comma; దళితులకు మూడెకరాల భూమి వంటి కీలక హామీల అమలుపై ప్రజలు పెదవి విరుస్తున్న సమయంలో హస్తం పార్టీ సరికొత్త వాగ్దానాలతో ప్రజల ముందుకు వచ్చింది&period; ఈ విషయంలో కర్ణాటకలో విజయవంతమైన ఫార్ములానే తెలంగాణలో పునరావృతం చేసింది&period; అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఇచ్చిన ఆరు వాగ్దానాలను అమలు చేస్తామని ప్రజలను మెప్పించడంలో విజయం సాధించింది&period; మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ ను దాటి దూసుకుపోయింది&period; కాంగ్రెస్‌ ఇంతలా బలపడటానికి కారణం ఆ పార్టీ నాయకులంతా ఏకతాటిపైకి రావడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు&period; కాంగ్రెస్‌ అంటే పదవుల కోసం కాదు&comma; ప్రజలకు మంచి పాలన అందించే పార్టీగా తీర్చిదిద్దాలని చేసిన ప్రయత్నాలు కర్ణాటకలో స్పష్టమయ్యాయి&period; రాజస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలు కర్ణాటకలోనూ రిపీట్‌ అవుతాయని అంతా అనుకున్నారు&period; కానీ ఒక్కసారిగా సీన్‌ రివర్స్‌ అయ్యింది&period; ఎన్నడూ లేనంతగా నాయకులు సైలెంట్‌గా వ్యవహరిస్తూ అధిష్ఠానం మాటకు కట్టుబడి ఉంటూ ఎన్నికల్లో పని చేశారు&period; ముఖ్యంగా సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ విపరీతంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేయడం&comma; మేనిఫెస్టో హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సఫలీకృతమయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.