ముస్లింలకు నిజమైన శత్రువు కాంగ్రెస్ – ఎమ్మెల్సీ కవిత

mlc kavitha

Advertisements

&NewLine;<p>ముస్లీంలకు నిజమైన శతృవు కాంగ్రెస్ పార్టీ అని&comma; ముస్లీం సమాజాన్ని ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు&period; కాబట్టి కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు&period; బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి&comma; ఎమ్మెల్యే షకీల్ కు మద్ధతుగా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లిలో నిర్వహించిన రోడ్ షో లో కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు&period; ముస్లీంల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని తెలిపారు&period; ఆ పార్టీ లౌకిక పార్టీ కాదని విమర్శంచారు&period; కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మతకల్లోలాలు జరుగుతున్నాయని&comma; గతంలో మన దగ్గర కూడా కాంగ్రెస్ హయాంలో తరుచూ మతకల్లోలాలు&comma; కర్ఫ్యూలతో భయంకరమైన పరిస్థితి ఉండేదని&comma; కానీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న మతకల్లోలం కూడా జరగలేదని వివరించారు&period; బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని&comma; దేవాలయాలు&comma; మసీదులు&comma; చర్చిలకు&comma; గురుద్వారలకు ఖజానా నుంచి డబ్బులు ఇచ్చిందని గుర్తు చేశారు&period; ఏ ఒక్క మతం పట్ల తాము వివక్ష చూపకుండా పరిపాలించామని స్పష్టం చేశారు&period; తెలంగాణలో మతసామరస్యం ఇలాగే వర్ధిల్లాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగాలని అన్నారు&period; &OpenCurlyDoubleQuote;కార్ కా నిషాన్… తెలంగాణ కా షాన్ హై” అని వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..