ధనియాలను భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ధనియాలను రాత్రి పడుకునే ముందు చల్లటి నీళ్లలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని కళ్లపై చల్లుకుని కడుక్కోవాలి. ఈ నీరు కళ్లకు మేలు చేస్తుంది. ఇలా రోజూ చేస్తే కంటి ఇన్ఫెక్షన్ దరిచేరదు. బహిష్టు సమస్యలు 6 గ్రాముల ధనియాల గింజలను 500 మి.లీ నీటిలో మరిగించి, 1 టేబుల్ స్పూన్ తేనె వేసి వేడిగా తాగాలి. ఇది శరీరంలోని ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఋతు చక్రం మెరుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. ధనియాలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల శరీరంలోని అనేక సమస్యలను నివారించవచ్చు. ఈ గింజలను 4 స్పూన్లు రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి. ధనియాల గింజల్లో ఉండే అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు కళ్లలో దురద, మంట , ఎర్రబడడం వంటి వాటికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ధనియాలు నానబెట్టిన నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు రోజూ ఈ నీటిని తాగవచ్చు. కొంతమంది మహిళలు ఎముకల సమస్యలతో బాధపడుతుంటారు. ప్రత్యేకంగా నానబెట్టిన ఈ నీటిని వారానికి రెండు సార్లు తాగితే ఈ సమస్య తీరుతుంది. 3 గ్రాముల ధనియా గింజల పొడిని 150 ml నీటిలో మరిగించి త్రాగాలి. ఇలా నీరు తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారడంతో పాటు ఎముకలకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి.
ధనియాల నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
107
previous post