దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

Advertisements

&NewLine;<p>దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి&period; పది రోజుల కిందట రోజుకు పదీ ఇరవై లోపు నమోదైన కేసులు తాజాగా వందల్లోకి చేరాయి&period; వారం కిందట మొత్తం బాధితుల సంఖ్య వందల్లో ఉండగా నేడు అది వేలల్లోకి చేరింది&period; మొన్న 350 నిన్న 640 గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య శనివారానికి 752 కు చేరింది&period; దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3&comma;420 కాగా ఇందులో ఎక్కువ శాతం కేరళలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది&period; అయితే&comma; ముందుజాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు&comma; కేంద్ర పాలిత ప్రాంతాలను ఇప్పటికే అలర్ట్ చేసినట్లు తెలిపింది&period; వైరస్ తో గడిచిన 24 గంటల్లో నలుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు&period; జేఎన్&period;1 సబ్ వేరియంట్ కేసులు బయటపడ్డ కేరళలోనే వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోందని తెలిపారు&period; నిన్న బయటపడ్డ కొత్త కేసులు మొత్తం 752 కాగా అందులో 565 మంది కరోనా బాధితులు కేరళలోనే ఉన్నారని వివరించారు&period; యాక్టివ్ కేసులు కూడా కేరళలోనే అత్యధికమని&comma; వైరస్ బాధితులలో 2&comma;872 మంది కేరళలోనే ఉన్నారని చెప్పారు&period; గోవాలోనూ జేఎన్&period;1 సబ్ వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.