TOPS మాజీ మంత్రి హరీష్ రావుపై ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.

Advertisements

<p>తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆరోపణలు&comma; ప్రత్యారోపణలు చర్చనీయాంశంగా మారాయి&period; మాజీ మంత్రి&comma; బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు&period; విద్యార్థులతో కలిసి పోలీసులను కలిసిన ఆయన&comma; తెలంగాణలో వర్షాలు కురవకుండా&comma; ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బందులు పడాలనే ఉద్దేశంతో హరీష్ రావు తమిళనాడు&comma; కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో క్షుద్ర పూజలు నిర్వహించారంటూ ఆరోపించారు&period; ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం సమాజానికి మంచిది కాదని పేర్కొంటూ&comma; తెలంగాణ ప్రజలకు హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు&period; రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సమయంలో ఇలాంటి చర్యలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నమని విమర్శించారు&period; ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.