రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.

Advertisements

<p>రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక కేసులో విషాదం చోటుచేసుకుంది&period; తీవ్ర గాయాలతో సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియాంక మృతి చెందారు&period; ఆదివారం మధ్యాహ్నం 3&period;22 గంటలకు ప్రియాంక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p>రాజమహేంద్రవరంలో ఓ మాల్‌ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రియాంక స్కూటీని నిందితులు కారుతో ఢీకొట్టారు&period; తొలుత ఈ ఘటనను పోలీసులు హిట్‌ అండ్‌ రన్‌ కేసుగా పరిగణించారు&period; అయితే సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా&period;&period; నిందితులు ఉద్దేశపూర్వకంగానే ప్రియాంక స్కూటీని పలుమార్లు కారుతో ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు&period;<&sol;p>&NewLine;<p>సీసీ కెమెరా ఆధారాలతో కేసులో సెక్షన్లను మార్చిన పోలీసులు&period;&period; ఇది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని నిర్ధారించారు&period; ప్రియాంకపై హత్యాయత్నం జరిగినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ ఇప్పటికే వెల్లడించారు&period; నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు&period;<&sol;p>&NewLine;<p>ప్రియాంకకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు&period; అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు&period; ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా స్పందించి&period;&period; నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు&comma; మంత్రి నారా లోకేశ్‌ సీరియస్‌గా పరిగణించారు&period; సీఎం ఆదేశాలతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు&period; ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టినట్లు నిర్ధారించడంతో కేసును మరింత తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు&period; ప్రియాంక మృతితో ఈ ఘటనపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్