నీట్ పేపర్ లీక్ కేసులో బిగ్ అప్‌డేట్..

నీట్ పేపర్ లీక్ కేసులో బిగ్ అప్‌డేట్ నీట్ పేపర్ లీక్ కేసులో బిగ్ అప్‌డేట్

Advertisements

<p>నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది&period; ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నిందితురాలు మనీషా గురునాథ్ మాంధరేనికి ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు 14 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది&period; మహారాష్ట్ర పూణేకు చెందిన మనీషా&period;&period; ఒక సీనియర్ బోటనీ అధ్యాపకురాలు&period; ఈమెను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక నిపుణురాలిగా నియమించడంతో&comma; నీట్ పరీక్షకు సంబంధించిన బోటనీ&comma; జువాలజీ ప్రశ్నపత్రాలపై పూర్తి యాక్సెస్ లభించింది&period; ఆ అవకాశాన్ని వాడుకుని ఆమె పేపర్ లీక్ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది&period; ఎన్‌టీఏ లోపల ప్రశ్నపత్రాల తయారీ నుంచి పంపిణీ వరకు జరిగిన మొత్తం ప్రక్రియపై ప్రస్తుతం లోతైన దర్యాప్తు జరుగుతోందని సీబీఐ కోర్టుకు తెలిపింది&period; మనీషా మాంధరే లీకైన ప్రశ్నలను విద్యార్థులకు ముందుగానే చేరవేసి&comma; అందుకు ప్రతిఫలంగా వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు సేకరించారు&period; దీని వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు&comma; నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించాల్సి ఉందని సీబీఐ స్పష్టం చేసింది&period; ఏప్రిల్ నెలలోనే ఈమె తన పూణే నివాసంలో సీక్రెట్ కోచింగ్ క్లాసులు పెట్టి లీకైన ప్రశ్నలను నోట్ బుక్స్‌లో రాయించినట్లు దర్యాప్తులో తేలినట్లు సీబీఐ కోర్టుకు స్పష్టం చేసింది&period; సీబీఐ రిమాండ్ దరఖాస్తును నిందితురాలి తరపు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు&period; నిందితురాలి ఇంట్లో జరిపిన తనిఖీల్లో ఎలాంటి లీకేజీ ఆధారాలు&comma; అక్రమ నిధులు లభించలేదని కోర్టుకు వివరించారు&period; మనీషా ఇప్పటికే రెండుసార్లు సీబీఐ విచారణకు హాజరై పూర్తిగా సహకరించిందని&comma; గత 3 రోజులుగా ఆమె పోలీసు కస్టడీలోనే ఉందని గుర్తుచేశారు&period; ఈమెను మథురలోని ఒక హోటల్‌లో అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని వాదించారు&period; ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ ఎవెన్యూ కోర్టు&period;&period; ఈ కుంభకోణంలో ఉన్న అంతర్జాతీయ&comma; జాతీయ నెట్‌వర్క్‌ను&comma; ఎన్‌టీఏ లీకేజీ మూలాలను గుర్తించేందుకు నిందితురాలిని 14 రోజుల పాటు ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతినిచ్చింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.