బోడుప్పల్ రాఘవేంద్ర కాలనీలో అర్ధరాత్రి చోరీకి యత్నం.

Advertisements

<p>మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి చోరీకి దొంగ ప్రయత్నించడం కలకలం రేపింది&period; బోడుప్పల్ రాఘవేంద్ర కాలనీలో ఓ డూప్లెక్స్ ఇంట్లోకి చొరబడేందుకు గుర్తుతెలియని దుండగుడు ప్రయత్నించాడు&period; అర్ధరాత్రి సమయంలో ఇంటి తలుపును పగలగొట్టి లోపలికి ప్రవేశించేందుకు దొంగ తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది&period;అయితే అదే సమయంలో ఇంట్లో కుటుంబసభ్యులు ఉండటంతో దుండగుడి ప్రయత్నం బెడిసికొట్టింది&period; తలుపు పగలగొట్టేందుకు దొంగ ప్రయత్నిస్తున్న సమయంలో పెద్ద శబ్దం రావడంతో కుటుంబసభ్యులు అప్రమత్తమయ్యారు&period; వెంటనే గట్టిగా అరవడంతో దుండగుడు ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు&period;కుటుంబసభ్యులు బయటకు వచ్చేలోపే దొంగ గోడ దూకి పరారైనట్లు తెలుస్తోంది&period; దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు&period; అర్ధరాత్రి సమయంలో ఇళ్లలోకి చొరబడేందుకు దొంగలు ప్రయత్నిస్తుండటంతో కాలనీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్