నిజామాబాద్‌లో భార్యాభర్తల మృతి.

Advertisements

<p>నిజామాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది&period; ఆర్థిక ఇబ్బందులు&comma; అప్పుల ఒత్తిడి&comma; అనారోగ్య సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ భార్యాభర్తలు మృతి చెందారు&period; ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది&period;విద్యుత్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నరేష్‌ ఇటీవలే నిజామాబాద్‌ రూరల్‌ ఈఈఆర్‌ఓ సెక్షన్‌లో విధుల్లో చేరారు&period; కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో అంచనాలకు మించి ఖర్చులు పెరగడం&period;&period; అప్పులు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం&period; అప్పుల్లో కొంత భాగాన్ని తీర్చేందుకు ఇంటిని విక్రయించినప్పటికీ&period;&period; మరికొన్ని అప్పులు మిగిలిపోయాయి&period; రుణదాతల ఒత్తిడి పెరగడంతో భార్యాభర్తలు తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>నిన్న ఇద్దరు పిల్లలను సరస్వతీనగర్‌లోని నరేష్‌ సోదరి వద్ద ఉంచి&period;&period; భార్యతో కలిసి పంచముఖి హనుమాన్‌ ఆలయం సమీపంలోని అద్దె ఇంటికి వెళ్లారు&period; ఇంటి తలుపులు తెరవకపోవడంతో యజమాని పోలీసులకు సమాచారం అందించారు&period; పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా&period;&period; ఇద్దరూ అపస్మారక స్థితిలో కనిపించారు&period; వెంటనే ఆసుపత్రికి తరలించగా&period;&period; అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు&period;ఘటనపై మేఘన తండ్రి మోహన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period; నరేష్‌ రాసినట్లు భావిస్తున్న ఓ లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం&period; అందులో ఆర్థిక ఇబ్బందులు&comma; అనారోగ్యం&comma; మానసిక ఒత్తిడితో తీవ్రంగా బాధపడుతున్నట్లు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>అయితే తల్లిదండ్రుల మృతితో తొమ్మిదేళ్ల బాలుడు&comma; ఏడేళ్ల చిన్నారి ఒక్కసారిగా తల్లిదండ్రులను కోల్పోయారు&period; తమ తల్లిదండ్రులు ఎప్పుడు వస్తారంటూ బంధువులను అడుగుతున్న చిన్నారులను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు&period; పిల్లల భవిష్యత్తుపై ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది&period;విద్యుత్‌ శాఖ ఉద్యోగిగా సహచరులతో ఆప్యాయంగా ఉండే నరేష్‌ మృతితో సహోద్యోగులు విషాదంలో మునిగిపోయారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్