కొండమల్లేపల్లిలో మహిళ దారుణ హత్య.

Advertisements

<p>నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది&period; జేబీ కాలనీలో రూపారెడ్డి అనే 45 ఏళ్ల మహిళ హత్యకు గురయ్యారు&period; ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు&period;కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌గా రూపారెడ్డి వ్యవహరిస్తున్నారు&period; ఆమె భర్త హైదరాబాద్‌లో ఉండగా&period;&period; భార్యకు ఫోన్‌ చేయడంతో ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది&period; దీంతో అనుమానం వచ్చిన భర్త&period;&period; ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది&period;సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు&period; ఇంటి తలుపులు తెరిచి పరిశీలించి&period;&period; ఆధారాలు సేకరిస్తున్నారు&period; గుర్తుతెలియని వ్యక్తులు రూపారెడ్డిని హత్య చేసి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు&period;హత్యకు గల కారణాలు ఏంటి&period;&period;&quest; ఘటన వెనుక ఎవరు ఉన్నారు&period;&period;&quest; అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period; పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్