వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

Advertisements

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు&period; కేసులకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయగా&period;&period; మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు&period; కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు&period; అరెస్టయిన నిందితుల నుంచి సుమారు 150 గ్రాముల బరువున్న ఆరు బంగారు గొలుసులు&comma; మూడు ద్విచక్ర వాహనాలు&comma; ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు&period; స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు 26 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు&period; ప్రధాన నిందితుడు సున్నం నాగేంద్రబాబు తన సహచరులతో కలిసి రాత్రివేళ ఇళ్ల బయట నిద్రిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు&period; ఎలక్ట్రిక్ వైర్ కట్టర్‌తో మహిళల మెడలోని బంగారు గొలుసులను కట్ చేసి అపహరించినట్లు ఎస్పీ వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.

సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.