కామారెడ్డిలో వ్యాపారి కిడ్నాప్ ప్లాన్‌కు చెక్ పెట్టిన తాడ్వాయి పోలీసులు..

కామారెడ్డిలో వ్యాపారి కిడ్నాప్ ప్లాన్‌కు చెక్ పెట్టిన తాడ్వాయి పోలీసులు

Advertisements

<p>ఓ వ్యాపారి కిడ్నాప్ ప్లాన్‌కు తాడ్వాయి పోలీసులు చెక్ పెట్టారు&period; అక్రమ తుపాకీ&comma; రబ్బర్ బుల్లెట్లతో రెడీ అయిన ఆరుగురు కిరాతకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు&period; కామారెడ్డికి చెందిన భూసా శ్రీనివాస్ వద్ద భారీగా నగదు ఉందని పసిగట్టిన నిట్టు నర్సింగరావు ముఠా కిడ్నాప్‌కు తెగబడింది&period; పాత లావాదేవీల పగతో పక్కా ప్లాన్ రచించారు&period; ఇందుకోసం మహారాష్ట్ర నుంచి అక్రమ తుపాకీని రూ&period;30 వేలకు బేరం కుదుర్చుకుని&comma; అడ్వాన్స్‌గా రూ&period;27 వేలు చెల్లించారు&period; కృష్ణాజీవాడి శివాలయం దగ్గర మాటు వేసిన ముఠా&comma; పోలీసుల రాకతో షాక్‌కు గురైంది&period; పక్కా సమాచారంతో దాడి చేసిన ఎస్సై నరేశ్ టీమ్&comma; పారిపోతున్న నిందితులను వెంటాడి పట్టుకుంది&period; ఇప్పటికే హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న నిట్టు నర్సింగరావు మళ్లీ అడ్డంగా దొరికిపోయాడు&period; నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సామగ్రి చూస్తే వీరి ప్లాన్ ఎంత పకడ్బందీగా ఉందో అర్థమవుతోందని ఎస్పీ తెలిపారు&period; ఫైర్ ఆర్మ్&comma; 5 రబ్బర్ బుల్లెట్లు&comma; ఎయిర్ రైఫిల్ పెల్లెట్లు&comma; 5 సెల్‌ఫోన్లు&comma; మంకీ క్యాప్స్&comma; మాస్కులు&comma; నైలాన్ తాడు&comma; గాగుల్స్&comma; బైక్ స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు&period; తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన నిట్టు నర్సింగరావు&comma; సూరం స్వామి&comma; సంతాయిపేట్‌కు చెందిన వడ్డె స్వామి&comma; పులి ప్రశాంత్ గౌడ్&comma; మహారాష్ట్రకు చెందిన తుపాకీ సప్లయర్స్ వైభవ్ ప్రకాశ్&comma; అజయ్ గోంగపాలేలను అరెస్ట్ చేశామని&comma; పరారీలో ఉన్న మారుతి మోకే కోసం గాలిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు&period; నిందితులపై ఆర్మ్స్ యాక్ట్&comma; బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని&comma; నేరగాళ్లను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..

బాల్కసుమన్కు 14 రోజుల రిమాండ్..

అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..