నీట్ లీక్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..

నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ కలకలం

Advertisements

<p>దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి&period; ఈ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో బయటికొస్తున్నాయి&period; రాజస్థాన్ నుంచి గురుగ్రామ్&comma; నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా&comma; సీబీఐ విచారణతో కీలక సూత్రధారులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు&period; రాజస్థాన్‌లోని జమ్వా రామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్&comma; దినేష్ బివాల్ అనే ఇద్దరు సోదరులు ఈ లీకేజీలో కీలకపాత్ర పోషించారు&period; వీరు పరీక్షకు వారం రోజుల ముందు&comma; ఏప్రిల్ 26à°¨ గురుగ్రామ్‌లోని ఓ డాక్టర్ నుంచి 30 లక్షలకు నీట్ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్లు తేలింది&period; ఆ తర్వాత సికార్‌లో నీట్ కోసం సిద్ధమవుతున్న తమ కుటుంబంలోని ఓ విద్యార్థికి ఆ పేపర్‌ను పంపించారు&period;<&sol;p>&NewLine;<p>దీంతో పేపర్ లీక్ కుంభకోణానికి రాజస్థాన్‌లోని సికార్ కేంద్రంగా మారినట్లు విచారణలో స్పష్టమైంది&period; రాజస్థాన్‌ సోదరుల నుంచి పేపర్ పొందిన ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ఏజెంట్ రాకేష్ కుమార్ మందవారియా దానిని పలువురికి విక్రయించాడు&period; ఆ తర్వాత సికార్‌లో పీజీ హాస్టల్‌లోని విద్యార్థులకు చేరింది పేపర్‌&period; దీంతో ఈ లీకేజీకి మూలం నాసిక్‌లోని ప్రింటింగ్ ప్రెస్ అని&comma; అక్కడి నుంచి ఓ &&num;8216&semi;చైన్ నెట్‌వర్క్&&num;8217&semi; ద్వారా గురుగ్రామ్ డాక్టర్‌కు చేరినట్లు రాజస్థాన్ పోలీసులు అనుమానిస్తున్నారు&period; సికార్ నుంచి ఈ పేపర్ జమ్మూకశ్మీర్&comma; బీహార్&comma; కేరళ&comma; ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చేరినట్లు ఆధారాలు లభించాయి&period; ఏజెంట్ రాకేష్ కుమార్ సుమారు 700 మంది విద్యార్థులకు పేపర్‌ను పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి&period; దీంతో మే 3à°¨ జరిగిన నీట్ పరీక్షను ప్రభుత్వం రద్దు చేసి కేసును సీబీఐకి అప్పగించింది&period; దీంతో రంగంలోకి దిగిన సీబీఐ&comma; పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది&period; ఇప్పటికే రాకేష్ కుమార్ మందవారియా&comma; యశ్ యాదవ్‌తో పాటు నాసిక్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు&period; పరీక్ష తేదీలను 7 నుంచి 10 రోజుల్లో ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..