కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.

కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్

Advertisements

<p>రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణ కీలక మలుపు తిరిగింది&period; ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సియా గోయల్&comma; చేతన్ చౌదరి మధ్య కేవలం సాధారణ పరిచయమే కాకుండా చాలా లోతైన వ్యక్తిగత సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు&period; వీరిద్దరి మధ్య గత కొన్ని నెలల్లో వేలసార్లు ఫోన్ కాల్స్ జరగడం&comma; హత్యకు ముందు రోజు ప్రత్యేకంగా సమావేశం కావడం వంటి అంశాలు ఇప్పుడు దర్యాప్తును కొత్త కోణంలోకి తీసుకెళుతున్నాయి&period; నిందితుడు చేతన్ చౌదరి&period;&period;సియా గోయల్ అన్న సాహిల్ గోయల్‌కు క్రికెట్ ద్వారా మిత్రుడు&period; సాహిల్‌తో కలిసి చేతన్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడేవాడు&period; ఆ సమయంలో సియా తరచుగా తన సోదరుడితో పాటు మ్యాచ్‌లకు వెళ్లేది&period; అప్పుడే వారిద్దరి మధ్య తొలి పరిచయం ఏర్పడిందని భావిస్తున్నారు పోలీసులు&period; ఆ తర్వాత 2025 దీపావళి సందర్భంగా ఓ కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో వీరిద్దరూ మళ్లీ కలుసుకున్నారు&period; అప్పటి నుంచి వీరి మధ్య సంభాషణలు&comma; రాకపోకలు బాగా పెరిగాయి&period; విచారణలో భాగంగా పరిశీలించిన కాల్ డేటా రికార్డులు విస్తుపోయే నిజాలను బయటపెట్టాయి&period; ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సియా&comma; చేతన్ మధ్య ఏకంగా 2 వేల 4 ఫోన్ కాల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు&period; ఈ కాల్స్ మొత్తం వ్యవధి దాదాపు 238 గంటలు ఉండటం వారి మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని సూచిస్తోంది&period; ఈ నేపథ్యంలోనే నిన్న సియా సోదరుడు సాహిల్ గోయల్‌ను దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన పోలీసులు&period;&period;సియా కుటుంబంలోని ఇతర సభ్యుల స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇక ఈ కేసులో డిజిటల్ ఆధారాలు అత్యంత కీలకంగా మారాయి&period; నిందితులిద్దరూ తమ ఫోన్లలోని వాట్సాప్&comma; ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లతో పాటు ఇతర ఆన్‌లైన్ కార్యకలాపాలకు సంబంధించిన డేటాను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేసినట్లు గుర్తించారు పోలీసులు&period; లోహగఢ్ సంఘటనకు ముందు&comma; ఆ తర్వాత కూడా ఈ సంభాషణలను తొలగించారని అనుమానిస్తున్నారు&period; కేవలం మెసేజ్‌లు డిలీట్ చేయడమే కాకుండా&comma; రీసైకిల్ బిన్‌లను కూడా ఖాళీ చేయడంతో&comma; డిలీట్ అయిన డేటాను రికవరీ చేసేందుకు ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు&period; ఇదిలా ఉంటే&period;&period;దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది&period; కేతన్ అగర్వాల్ హత్య జరగడానికి ఒక రోజు ముందు&comma; అంటే జూన్ 17à°¨&comma; సియా&comma; చేతన్&period;&period; పూణెలోని లుల్లానగర్ ప్రాంతంలో ఉన్న ఓ కేఫేలో సమావేశమైనట్లు పోలీసులు గుర్తించారు&period; సాయంత్రం 4&colon;30 నుంచి 5&colon;30 గంటల వరకు దాదాపు గంట పాటు వీరిద్దరూ అక్కడే గడిపారు&period; ఈ సమావేశంలోనే హత్యకు సంబంధించిన కుట్ర జరిగిందా&quest; అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు&period; ఈ భేటీ వివరాలు&comma; డిజిటల్ ఆధారాల విశ్లేషణతో కేసులో మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.