నాగర్ కర్నూల్ జిల్లా(Nagar Kurnool District) కేంద్రంలోని శ్రీపురం చౌరస్తా(Chowrasta)లో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం(Huge Fire Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో చిరు వ్యాపారుల డబ్బాలు దగ్ధమయ్యాయి. అంతా నిద్రిస్తున్న సమయంలో మూసి ఉంచిన చిరువ్యాపారుల డబ్బాలలో అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించి భారీ నష్టం జరిగింది. వ్యాపారస్తులు తమ వ్యాపారం చేసుకొని ఇంటికి వెళ్లిన తర్వాత అనుమానాస్పద స్థితిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారీ ఎత్తున ఎగిసిన మంటలకు ఫుట్ పాత్(Foot path) పై ఉన్న దుకాణాలు దహనమయ్యాయి.
ఇది చదవండి: సెల్ఫోన్ పేలి బాలిక చేయి ఛిద్రం..
చిరు వ్యాపారస్తులు ఎగిసిపడుతున్న మంటలను చూసి రోదిస్తూ శతవిధాల మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఫైర్ ఇంజన్ జిల్లాలో మరో ప్రాంతానికి వెళ్లడంతో కల్వకుర్తి నుంచి అగ్ని మాపక వాహనం సుమారు రెండు గంటల తర్వాత ఆలస్యంగా వచ్చింది. దీంతో ఐదు దుకాణ సముదాయాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానిక శాసనసభ్యులు కూచకుల రాజేష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి మల్లురవి, బీజేపీ ఎంపీ అభ్యర్థి భారత్ ప్రసాద్ లు సంఘటన స్థలానికి చేరుకుని బాదితులను ఓదార్చారు. వారికి ప్రభుత్వ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ములుగు జిల్లాలో హై అలర్ట్ .. మావోయిస్టుల అలజడి
- కర్నూలు జిల్లా హోసూరులో దారుణం
- నివురుగప్పిన నిప్పులా కప్పట్రాళ్ల..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి