గంభీరావుపేటలో బయోగ్యాస్ ప్లాంట్ ప్రారంభం..

గంభీరావుపేటలో బయోగ్యాస్ ప్లాంట్ ప్రారంభం

Advertisements

<p>రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రుల పర్యటించారు &period;ఈ గడ్జి ద్వారా గ్యాస్ ఉత్పత్తి చేసే బయోగ్యాస్ ప్లాంట్‌ను ప్రారంభించారు &period; దీని ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు&period; గ్రీన్ ఎనర్జీపై ప్రపంచం దృష్టి సారిస్తున్న ఈ సమయంలో&comma; పర్యావరణానికి హాని చేసే విధంగా వ్యర్థాలను కాల్చడం మానుకుని&comma; వాటిని వినియోగంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు&period; సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే కాకుండా&comma; భవిష్యత్ తరాలకు కాలుష్యం లేని ప్రకృతిని అందించడం మన బాధ్యత అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు&period; పప్పుధాన్యాలు&comma; మిల్లెట్లు వంటి పంటల సాగు ద్వారా రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చని&comma; ఈ దిశగా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు&period; అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు కూడా చేశారు&period; ఎంఎస్పీ ప్రకటించిన తర్వాత ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వెనుకడుగు వేయడంతో రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు&period; రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన తరువాత కేంద్రం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..