తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.

Advertisements

<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు&period; ఈ పర్యటనలో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు అవసరమైన కేంద్ర అనుమతులపై ఆయన దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది&period; ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి&comma; రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు&comma; సంక్షేమ పథకాలకు అందాల్సిన నిధులపై విజ్ఞప్తులు చేయనున్నారు&period; పాలనాపరమైన అంశాలతో పాటు&comma; ఏఐసీసీ అగ్రనేతలతో కూడా ముఖ్యమంత్రి సమావేశం కాబోతున్నారు&period; కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సాధించిన అఖండ విజయం ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యతను చేకూర్చింది&period; కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించి&comma; కూటమి విజయంలో తనవంతు కృషి చేశారు&period; ప్రస్తుతం కేరళ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుండగా&comma; ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు రేసులో బలంగా వినిపిస్తోంది&period; రేవంత్ రెడ్డికి&comma; వేణుగోపాల్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో&comma; ఈ ఢిల్లీ పర్యటనలో కేరళ రాజకీయ సమీకరణాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.