అనేక శివలింగములు ప్రతిష్ఠించి పుష్పక మెక్కి గౌతమి పశ్చిమ తటక మునకు వచ్చు సరికి పుష్పకము కదలలేదు. ఇందు క్షేత్రవిశేషము కలదని పరిశోధించగా ఒక పుట్ట కనబడెను. దానిని ఛేదించి అందు తపము ఆచరించుచున్న స్త్రీని చూచి, నీవు ఎవరవు అని అడుగగా ఆమె తన వృత్తాంతమును ఈ విధముగా వివరించెను. ఉత్కళ దేశమందు ఓడ్ర పుండ్రకమను పేరుగల నగరములో సోమశర్మ అను ముని ఉండెను. అతని కుమారుడు జయభద్రుడు. నేను అతని భార్యను నా పేరు శ్రమణి. నా రూపమును చూసి ఒక గంధర్వుడు నా పతి స్నానార్ధమై వెళ్ళిన తరువాత నా పతిరూపములో వచ్చి కామలీలయందు ప్రయత్నించుచుండగా నా భర్త వచ్చి తన రూపంలో నున్న గంధర్వుని భస్మము చేసేను. కృతాంజలిగా నున్న నన్ను చూచి నీవు ఛండాల స్త్రీగా అగుమని శపించెను. శాపగ్రస్తురాలలైన నేను మామగారి వద్ద మొర పెట్టుకొనగా, వారు దివ్యదృష్టి జరిగినది తెలుసుకొని గౌతమి నదిలో స్నానమాత్రముచే పాప పరిహారమగును. శివశివయని ఘోర తపము చేయుటవలన త్రేతాయుగములో శ్రీరామచంద్రుని దర్శన భాగ్యముచే నీవు ముక్తిని పొందగలనని చెప్పి వెళ్లిరి. అది మొదలు ఇప్పటివరకు తపము చేయుచుండె నని చెప్పెను. అంతట శ్రీరాముడు ఈశ్వరుని ప్రార్ధించగా ఈశ్వరుడు ప్రత్యక్షమై శ్రీరాముని ఆలింగనము చేసుకొనేను అంతట శ్రీ రాముడు ఈశ్వరా ! ఈ శ్రమణికి ముక్తిని ప్రసాదించమనియు, ముక్తి ఇమ్మని సర్వజనులు నిన్ను చూచిన క్షణకాలములో ముక్తినొందు వరము ప్రసాదించమని ప్రార్థించి, ఒక శివలింగము ప్రతిష్ఠించెను. అందువలన ఈ క్షేత్రము క్షణ ముక్తేశ్వర క్షేత్రముగా వెలుగొందుచున్నది.
శివాలయాలకు పోటెత్తిన భక్తులు..
73
previous post