తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత

Advertisements

<p>రాష్ట్ర మంత్రి సవిత ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆమె కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు&period;<br &sol;>&NewLine;దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో మంత్రి సవితకు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు&period; అనంతరం ఆలయ అధికారులు స్వామివారి పట్టువస్త్రాలు&comma; తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు&period;<br &sol;>&NewLine;ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన మంత్రి సవిత&comma; కళియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు&period; కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందడం సంతోషకరమని పేర్కొన్నారు&period;<br &sol;>&NewLine;రెండేళ్ల కాలంలో ప్రజలకు అవసరమైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందని ఆమె తెలిపారు&period; రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు మంత్రి సవిత వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.