శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

Advertisements

<p>శ్రీకాళహస్తి దేవస్థానం&comma; గుడిమల్లం అభివృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత కుమారుడు అనంత్ అంబానీ 48 కోట్ల విరాళాన్ని ప్రకటించినట్లు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు&period; మూడ్రోజుల క్రితం అనంత్ అంబానీ శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం విరాళం కోరినట్లు చెప్పారు&period; శ్రీకాళహస్తి దేవస్థాన అభివృద్ధికి 10 కోట్లు&comma; ఆలయంలో సెంట్రల్ ఏసీ ఏర్పాటుకు 3 కోట్లు&comma; దేవస్థానం అనుబంధ గోశాల అభివృద్ధికి 5 కోట్లు విరాళంగా అందించేందుకు అంబానీ అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే వెల్లడించారు&period; అలాగే&&num;8230&semi; గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం అభివృద్ది కోసం 25 కోట్ల విరాళం ప్రకటించారని&&num;8230&semi; అవసరమైతే మరో 10 కోట్ల వరకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనంత్ అంబానీ పేర్కొన్నారని చెప్పారు&period; శ్రీకాళహస్తి దేవస్థానం&comma; గుడిమల్లం ఆలయ అభివృద్ధి కోసం 48 కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీకి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు&period; విరాళాన్ని త్వరలోనే శ్రీకాళహస్తి దేవస్థానానికి అధికారికంగా అందజేయనున్నట్లు ఆయన చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.