అయోధ్య రామాలయం విరాళాల గోల్‌మాల్.

అయోధ్య రామాలయం విరాళాల గోల్‌మాల్

Advertisements

<p>దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన అయోధ్య రామాలయం విరాళాల్లో గోల్ మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు&period; ఆలయ హుండీ కానుకల లెక్కింపు&comma; భద్రత&comma; సీసీటీవీ ఫుటేజ్ నిర్వహణ&comma; బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియలో తీవ్రమైన లోపాలు జరిగినట్లు నిర్ధారించింది&period; అక్రమాలకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకుని దొంగిలించిన సొమ్మును రికవరీ చేయాలని సిట్ సిఫార్సు చేసింది&period;<br &sol;>&NewLine;ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం తన ప్రాథమిక నివేదికను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది&period; లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సిట్ బృందం&comma; ఈ నివేదికను యూపీ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్‌కు అందజేసింది&period;<&sol;p>&NewLine;<p>ఆలయ హుండీ కానుకల లెక్కింపు&comma; భద్రత&comma; సీసీటీవీ ఫుటేజ్ నిర్వహణ&comma; బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియలో తీవ్రమైన లోపాలు&comma; నిర్లక్ష్యం జరిగినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది&period; విరాళాల లెక్కింపు&comma; నిర్వహణతో సంబంధం ఉన్న దాదాపు 150 మంది ట్రస్టు సిబ్బంది&comma; బ్యాంకు అధికారులు&comma; ప్రైవేట్ ఉద్యోగులు సిట్ ప్రశ్నించింది&period; బంగారం&comma; వెండి&comma; వజ్రాల వంటి విలువైన కానుకల లెక్కలపై కొందరు ఆఫీస్ బేరర్లు ఇచ్చిన సమాధానాలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని తేలింది&period; గత ఏడాది జరిగిన మహా కుంభమేళా సమయంలో రోజుకు దాదాపు 10 లక్షల మంది భక్తులు రావడంతో&comma; భారీగా వచ్చిన నగదు విరాళాలను మళ్లించడంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు అక్రమాలకు బాధ్యులైన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేసింది&period; ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు అనుమానితుల నుంచి రూ&period; 2 కోట్ల నగదు&comma; ఒక ఎస్‌యూవీ వాహనం&comma; 3 ఐఫోన్లను రికవరీ చేశారు&period; అలాగే&comma; గతంలో విరాళాల లెక్కింపులో ఉన్న పాత సిబ్బంది అందరినీ విధుల నుంచి తొలగించారు&period; సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఈ నివేదిక సమర్పించబడగా&period;&period; రాబోయే 10 నుంచి 15 రోజుల్లో పూర్తి స్థాయి తుది నివేదికను అందజేస్తామని సిట్ సభ్యుడు విజయ్ విశ్వాస్ పంత్ తెలిపారు&period; ఈ నివేదిక ఆధారంగా దోషులపై సీఎం యోగి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.