భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ విస్తరణ పనులు ప్రారంభం.

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ విస్తరణ పనులు ప్రారంభం

Advertisements

<p>భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ విస్తరణ&comma; అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు&period; భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వైభవానికి తగిన విధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ పనులు చేపట్టారు&period; ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు&comma; జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను అధికారికంగా ప్రారంభించారు&period; శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో చేపట్టనున్న విస్తరణ&comma; అభివృద్ధి పనులకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; భద్రాచలం దేవస్థానం రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని ఎమ్మెల్యే వెంకట్రావు అన్నారు&period; ఆలయ అభివృద్ధి పనులు ఆగమశాస్త్ర నియమాలను పాటిస్తూ చేపడుతున్నామని చెప్పారు&period; ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేసేలా అధికారులు&comma; కాంట్రాక్టు సంస్థలతో సమన్వయం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.