జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఘనంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ.

జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఘనంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

Advertisements

<p>జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు&period; శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి&comma; శ్రీ విఘ్నేశ్వరుడు&comma; శ్రీ సుబ్రహ్మణ్యస్వామి&comma; శ్రీ ఆంజనేయస్వామి తదితర దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం&period; ఘాట్ రోడ్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు&period; దేవస్థానం స్థానాచార్యులు వేదమంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలను నిర్వహించారు&period;<br &sol;>&NewLine;దేవస్థానం ఆధ్వర్యంలో సంప్రదాయ తప్పెట్లు&comma; కోలాట నృత్యాలు&comma; భజన సంకీర్తనలు&comma; మంగళవాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ భక్తి శ్రద్ధలతో కొనసాగింది&period; ఘాట్ రోడ్&comma; కుమ్మరిపాలెం&comma; విద్యాధరపురం&comma; పాలప్యాక్టరీ&comma; చిట్టినగర్&comma; కొత్తపేట&comma; బ్రాహ్మణవీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రి వరకు నిర్ణయించిన మార్గంలో ఊరేగింపు సాగింది&period;మార్గమధ్యంలో స్థానిక మహిళలు పసుపు నీటితో రహదారులను శుద్ధి చేసి&comma; హారతులు ఇస్తూ కొబ్బరికాయలు సమర్పించి అమ్మవారికి స్వాగతం పలికారు&period; గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు కుంకుమ&comma; ప్రసాదాలను దేవస్థానం పంపిణీ చేసింది&period;వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.