పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు.

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్రా మండలం ఆలమూరు గ్రామంలో సుమారు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన వేపచెట్టు ప్రత్యేక ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది&period; గ్రామస్తులు తమ తాతలు&comma; ముత్తాతల కాలం నుంచే ఈ చెట్టును అమ్మవారి స్వరూపంగా భావిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు&period;ప్రతి ఐదేళ్లకోసారి ఈ వేపచెట్టు వద్ద భారీ జాతర మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది&period; చెట్టు మధ్య భాగంలో కలువపువ్వు ఆకారాన్ని పోలిన నిర్మాణం ఉండటంతో దీనిని దైవచిహ్నంగా భావిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు&period; బ్రహ్మంగారు చెప్పిన సంకేతాలకు అనుగుణంగా ఈ చెట్టుకు కలువపువ్వు పూసిందని స్థానికులు చెబుతున్నారు&period;<br &sol;>&NewLine;అయితే గత రాత్రి వీచిన స్వల్ప ఈదురుగాలుల కారణంగా ఈ పురాతన వేపచెట్టు నేలవాలింది&period; దీంతో గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు&period; గతంలో రహదారి విస్తరణ పనుల సమయంలో చెట్టును తొలగించే ప్రయత్నాలు జరిగినప్పటికీ&comma; చెట్టును తాకిన వారికి అనారోగ్య సమస్యలు వచ్చాయని నమ్ముతున్న గ్రామస్తులు&comma; దానిని యథాతథంగా ఉంచాలని అధికారులను కోరిన విషయం గుర్తుచేస్తున్నారు&period;ఇప్పుడు చెట్టు విరిగిపోవడంతో గ్రామానికి ఏదైనా అరిష్టం సంభవిస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; అయితే ఇవి గ్రామస్థుల విశ్వాసాలు మాత్రమేనని&comma; దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉండవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.