ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

Advertisements

<p>పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మావుళ్లమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది&period; శ్రావణ మాసం రెండో శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని వరలక్ష్మీ వ్రతాలు ఆచరిస్తున్నారు&period; ఈ సందర్భంగా మావుళ్లమ్మ అమ్మవారిని లక్షలాది గాజులతో అత్యంత సుందరంగా అలంకరించారు&period; గాజులతో అలంకరించిన అమ్మవారి రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది&period; అలాగే అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కూడా ప్రత్యేకంగా&comma; అద్భుతంగా అలంకరించారు&period; వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం&period; కుటుంబాల్లో సుఖసంతోషాలు&comma; ఐశ్వర్యం&comma; ఆరోగ్యం వెల్లివిరియాలని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు&period; ముఖ్యంగా మహిళలకు లక్ష్మీదేవి ధైర్యం&comma; సాహసం&comma; పరాక్రమం అందించాలని కోరుకుంటూ భక్తిశ్రద్ధలతో వ్రతాలు చేస్తున్నారు&period; ఆలయంలో ప్రత్యేక పూజలు&comma; కుంకుమార్చనలు నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు&period; గాజులతో అలంకరించిన మావుళ్లమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.

వైభవంగా యూనిక్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్ మీట్.