రూ.50 కోట్ల డిపాజిట్లు ఉన్నాభక్తులకు వసతులు శూన్యం..

రూ.50 కోట్ల డిపాజిట్లు ఉన్నాభక్తులకు వసతులు శూన్యం

Advertisements

<p>కేంద్ర ప్రభుత్వం ముద్రించిన దివ్యభారత్ పుస్తకంలో చోటు దక్కించుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయం… ప్రతి రోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు&period; ఏటా రూ&period;25 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది &period;బ్యాంకుల్లో రూ&period;50 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు సమాచారం&period; స్వామివారి పేరిట బంగారం&comma; వెండి నిల్వలు కూడా భారీగా ఉన్నప్పటికీ భక్తులకు సరైన వసతి సౌకర్యాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది&period; ఆలయంలో భక్తులు బస చేసేందుకు కనీస స్థాయిలో కూడా గదులు అందుబాటులో లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; కొంతమంది చెట్ల కింద&comma; మరికొందరు తాత్కాలిక షెడ్లలో రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది&period; పాత గదులు శిథిలావస్థకు చేరగా&comma; కొన్ని గదులను ప్రైవేట్ వ్యక్తులు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా శాశ్వత వసతి ఏర్పాట్లపై పాలకులు దృష్టి పెట్టకపోవడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు&period;<br &sol;>&NewLine;&lpar;&rpar;<br &sol;>&NewLine;కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధిపై ప్రభుత్వం&comma; దేవాదాయ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు&period; టీటీడీ నిధులతో నిర్మించనున్న 96 గదులు త్వరగా పూర్తి చేస్తే భక్తులకు ఎంతో ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు&period; ప్రస్తుతం పాత కోనేరు పైభాగంలో నిర్మించిన డార్మిటరీ భవనాలను ప్రసాదం తయారీ&comma; అన్నదానం కోసం వినియోగిస్తున్నారు&period; దీంతో భక్తులకు బస కోసం సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి&period; ఆలయ పరిసరాల్లో ఉన్న ఫారెస్ట్ భూమిని ప్రభుత్వ సమన్వయంతో ఆలయానికి కేటాయించి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు&period; 200 ఎకరాల భూమి ఆలయానికి అందితే భక్తులకు శాశ్వత వసతి గదులు&comma; పార్కింగ్&comma; అన్నదాన భవనాలు&comma; విశ్రాంతి కేంద్రాలు నిర్మించవచ్చని సూచిస్తున్నారు&period; ప్రతి ఏడాది తాత్కాలిక చలువ పందిళ్ల కోసం ఖర్చు చేసే నిధులతో శాశ్వత రేకుల షెడ్లు నిర్మిస్తే భక్తులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు&period; కోట్ల ఆదాయం ఉన్న అంజన్న క్షేత్రంలో భక్తులకు కనీస వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..