అనంతపురం(Anantapur)లోని అతి ప్రాచీనమైన శ్రీరాముడు దేవాలయాల్లో(Sri Rama Temples) ఒకటి శ్రీ కోదండ రాముని దేవాలయం(Sri Kodanda Rama Temple). ఈ దేవాలయం అనంతపురం నగరంలోని పాతూరులో సున్నపు గేర్ల వద్ద కలదు. దాదాపుగా 300 సంవత్సరాల పై చిలుకు క్రితమే నిర్మించబడి ఉన్నదని ఇక్కడే చరిత్ర, పురోహితుల ద్వారా తెలుస్తోంది. ఈ దేవాలయం మొదటగా అనంతపురం నగరానికి చెందిన కోనేటి వంశస్థుల ద్వారా నిర్మించబడినది అని చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. అయితే మొదటగా ఈ ప్రాంతం పంట పొలాలతో ఉండేదని ఇక్కడ ఒక చెరువు కూడా నిర్మించబడి ఉండాలని ఆ చెరువు కట్ట పైన నిర్మించబడి ఉన్న మొదటిగా ఈ కోదండరాముడు దేవాలయమును ఆ తర్వాత కోనేటి వంశస్థులు దీనిని నిర్మించి అభివృద్ధి చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇంతటి చరిత్ర గల కోదండరాముని దేవాలయమును భక్తులు భక్తిశ్రద్ధలతో నిష్టుతో పూజిస్తూ ఉంటారు. ఇక్కడ దేవాలయంలో శ్రీరామునికి అర్చనలు, భజనలు, కీర్తనలు మరియు ఉట్ల పరస ఘనంగా నిర్వహిస్తారు. ఇంతటి చరిత్ర గల దేవాలయమును దేవాదాయ శాఖ గుర్తించి వీటి నిర్వహణ ఈ శాఖ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయంలో స్థాపితమైన సీతారాముని విగ్రహం , లక్ష్మణుడి విగ్రహం ఎంతో తేజస్సుతో దర్శనమిస్తారు. ఇక్కడ నవగ్రహాల పూజలు చేయడానికి కూడా నవగ్రహాల విగ్రహాలు ఉన్నాయి. ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఇక్కడ ఎంతో తేజస్తో దర్శనమిస్తుంది. వేపచెట్టు బోధి వృక్షం రెండూ కలిసి ఇక్కడ వెలిసాయి. ఈ చెట్లకు పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. అంతేకాక శ్రీ కోదండ స్వామికి ఇక్కడ నిత్యం పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ శ్రీరాముని కొలిచినవారి కోరికలను స్వామివారు తప్పకుండా నెరవేస్తారని ఎంతోమంది భక్తులు గాఢంగా విశ్వసిస్తారు.
- శివనామస్మరణతో మార్మోగుతున్న ద్రాక్షారామంకార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే మహిళలు గోదావరి నదిలో స్థానం ఆచరించి అరటి దొప్పలతో దీపాలు…
- భక్త జనసంద్రంగా మారిన యాదాద్రి దేవాలయంయాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్త జనసంద్రంగా మారింది. కార్తీకమాసంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి వారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు భారీగా బారులు తీరారు. కార్తీక దీపారాధన పూజలు, సత్యనారాయణ స్వామి…
- ఈ నెల 28 నుంచి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలుఈ నెల 28 నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. డిసెంబర్ 6 వరకు నిర్వహించే ఈ ఉత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.