ట్రంప్ విజయం సాధించారా? లేదా?

Republican Primary Election

Advertisements

&NewLine;<p>అధ్యక్ష ఎన్నికల రేసులో అత్యంత కీలకమైన రిపబ్లికన్ ప్రైమరీ ఎలక్షన్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలక విజయం సాధించారు&period; న్యూ హాంప్‌షైర్ ప్రైమరీని ఆయన గెలిచారు&period; దీంతో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్‌ను ఖరారు చేసుకోవడానికి ఆయన చేరువయ్యారు&period; ఇక ఈ గెలుపుతో అధ్యక్షుడు జో బైడెన్‌తో సమానంగా ట్రంప్ నిలిచారు&period; అయితే రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌నకు ఏకైక పోటీదారుగా భావిస్తున్న నిక్కీ హేలీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది&period; నిక్కీ హేలీ రేసు నుంచి తప్పుకునే స్థాయిలో ట్రంప్ విజయం సాధించారా లేదా అనేది తెలియాల్సి ఉంది&period; కౌంటింగ్ ఇంకా కొనసాగుతుండడంతో ఈ విషయంలో అస్పష్టత నెలకొంది&period; కాగా అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్రంప్ మాత్రమే ఓడించగలరని రిపబ్లికన్లు భావిస్తున్నారు&period; అందుకే ఆయనకు మద్ధతు ఇస్తున్నారు&period; నిక్కీ హేలీ కూడా గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు&period; అధ్యక్ష ఎన్నికల రేసులో తాను చాలా దూరంలో ఉన్నానని అన్నారు&period; అయితే న్యూ హాంప్‌షైర్ ప్రైమరీలో ఓటు అనుకూలంగా పడుతుందని ఆమె భావించారు&period; కానీ ప్రాథమిక సమాచారం ప్రకారం నిక్కీ హేలీ ఓటమి అంచున నిలిచారు&period; అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్‌పై రెండుసార్లు అభిశంసన తీర్మానాలు&comma; ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులో విచారణలో ఉన్నప్పటికీ రిపబ్లికన్లు ఆయనవైపే మొగ్గు చూపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్