దీపావళీ పండగ రోజున ప్రకాశం జిల్లా మార్కాపురం లో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయి. పట్టణంలోని స్థానిక నెహ్రు బజార్లో నరకాసుర వధ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది.బజార్లోని మాధవి హ్యాండ్లూమ్స్ షాప్ బయట శారీలు ఉన్న అట్టలకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించి ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలను ఆర్పి వేశారు. షాపులో సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మండలం లోని వేముల పేట గ్రామంలో పూరింట్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 60 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందనీ ఇంటి యజమాని తెలిపారు.
నరకాసుర వధ కార్యక్రమంలో అపశృతి .. రెండు చోట్ల అగ్నిప్రమాదాలు
93
previous post