61
కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సొంత పార్టీలోనే అసమ్మతి ఎదురవుతోంది. ఇటీవల పిఠాపురం, యు కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలలో పర్యటించిన ఎమ్మెల్యేను ప్రజలు నిలదీశారు. కొత్తపల్లి మండలంలో వైసీపీలోని రెండు వర్గాలు కేసులు పెట్టుకునే పతాక స్థాయికి అసమ్మతి చేరింది. గృహ లబ్ధిదారులకు పట్టాలిచ్చినా స్థలాలు ఎక్కడున్నాయో చూపించలేదని నాగులాపల్లి లో ఎమ్మెల్యేను నిలదీశారు. ఇక్కడ ఎమ్మెల్యే దొరబాబును పరుగులు పెట్టించే వరకు పరిస్థితి దారితీయటంతో అధికారులు సైతం నివ్వెరపోయారు. దీనికి తోడు ఆయన సొంత అల్లుడు జనసేనలో చేరారు. ఈసారి దొరబాబుకు టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం జరుగుతోంది.