ప్రతి వంటింట్లో తప్పకుండా ఉండే తియ్యని ఆహార పదార్ధము బెల్లం. బెల్లంతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తారు. ముఖ్యంగా సంక్రాంతి టైమ్లో బెల్లంతో చేసిన అనేక పిండి వంటలు భారతీయుల ఇంట్లో దర్శనమిస్తాయి. ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని రకరకాల మందులలో ఉపయోగిస్తారు. ఇక మనం రోజు వాడే పంచదార కంటే బెల్లం ఆరోగ్యపరంగా చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు చాలా మంది బెల్లాన్ని అధికంగా వాడుతున్నారు. అయితే అతి ఆరోగ్యానికే చేటు అని వినే ఉంటారు. అది బెల్లం విషయంలోనూ వర్తిస్తుంది. అవును! అతిగా బెల్లం ఉపయోగిస్తే. అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బెల్లం అతిగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బెల్లంలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్లతోపాటు కొవ్వులు, ప్రోటీన్లు కూడా ఉంటాయి. అయితే బెల్లాన్ని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. పరిమితిని మించి తీసుకున్నప్పుడే బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు. ఇక మధుమేహం రోగులు చక్కెరకు ప్రత్యామ్నయంగా బెల్లం తినొచ్చు అని చెబుతుంటారు. కానీ, అతిగా బెల్లాన్ని తీసుకుంటే మాత్రం బ్లడ్ షూగర్ స్థాయిలు పెరిగిపోతాయి. మరియు మధుమేహం లేని వారు కూడా అతిగా బెల్లం తింటే డయబెటీస్ వచ్చే రిస్క్ ఉంది. బెల్లం అతిగా తింటే మలబద్ధక సమస్య కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యానికి మంచిదే కదా అని ఓవర్గా మాత్రం బెల్లం తీసుకోకండి. శరీరానికి ఎంత కావాలో అంత మాత్రమే మీ డైలీ డైట్లో చేర్చుకోండి.
బెల్లం తింటే ఈ సమస్యలు వస్తాయని మీకు తెలుసా..?
85
previous post