శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో వైద్యం పేరుతో కోట్లు దండుకుంటున్నారు. ఫెర్టిలిటీ సెంటర్(Fertility Center) పేరుతో దారుణాలకు తెగబడుతున్నారు. సెంటిమెంట్‌నే సంపాదనకు సులువైన మార్గంగా ఎంచుకున్నారు. పిల్లలు లేని దంపతులే టార్గెట్‌గా ఇద్దరు డాక్టర్లు(Doctors) చెలరేగిపోతున్నారు. గర్భిణీ మహిళలపై అడ్డగోలు ప్రయోగాలు చేస్తున్నారు. ప్రమాదకరమైన స్టెరాయిడ్స్‌ను గర్భిణీలకు ఇష్టారీతిన వాడుతున్నారు. పేషెంట్ల ప్రాణాల మీదకు తెస్తున్నారు. సీవీఆర్ స్టింగ్ ఆపరేషన్‌లో ఈ బండారం బట్టబయలయ్యింది.
ఇది చదవండి: రాజోలులో జనసేనకు భారీ షాక్…..
రీజాయిస్ ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో డాక్టర్ మెట్టా సందీప్(Dr. Metta Sandeep), డాక్టర్ శాంతిప్రియ(Dr. Shantipriya) ఓ సెంటర్ తెరిచారు. పిల్లలు లేని దంపతులకు ఆశలు కల్పిస్తూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే సత్యవతి అనే పేషెంట్‌పై విచ్చల విడిగా ప్రయోగాలు చేశారు. ఇప్పుడా మహిళ.. ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతోంది. పండంటి బిడ్డను అందిస్తామంటూ ఆ దంపతుల దగ్గర 17లక్షల రూపాయలు వసూలు చేశారు. దీంతో, ఆ పేషెంట్ కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సత్యవతి ఆరోగ్యం విషయంలో ఆవేదన చెందుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేత
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి