హైదరాబాద్..తనకు న్యాయం చేయాలంటూ ఓ గృహిణి వారాసి గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముషీరాబాద్ బాపూజీ నగర్ లో భర్త, అత్త, మామ ఇంటి ముందు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ధర్నాకు దిగింది. సైదాబాద్ కి చెందిన పవిత్ర కు 2015లో నవంబర్లో ముషీరాబాద్ బాపూజీ నగర్ కు చెందిన కార్తీక్ చంద్రతో వివాహం జరిగింది. వివాహ సమయంలో పవిత్ర తల్లిదండ్రులు 10 లక్షల కట్నం నలభై తులాల బంగారం, రెండు కిలోలు వెండి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. 2016లో పవిత్ర కార్తీక్ చంద్ర లకు కూతురు పుట్టింది. అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. పవిత్ర తండ్రి పేరు మీద ఉన్న ఇల్లు రాయించుకు రావాలని, అదనపు కట్నం తీసుకురావాలని, భర్త కార్తీక్ చంద్ర, అత్త రమాదేవి, మామ రామచందర్, ఆడపడుచులు వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. కార్తీక్ చంద్ర కు వివాహం జరగలేదని మరో సంబంధం చూడడంతో సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని ఒక్క కౌన్సిలింగ్ వచ్చి మిగతా కౌన్సిలింగ్ లకు రావడంలేదని ఆమె ఆరోపించారు. బీసీ గ్రూపు పూసల కులానికి చెందిన మా అత్త, మామ ఆడపడుచులు ఎస్సీ కులానికి చెందిన వారమని దొంగ సర్టిఫికెట్లు తీసుకోవడంతోపాటు ఉద్యోగాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆడపిల్ల పుట్టిందని కారణాలు చూపిస్తూ మరింత వరకట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానిక వారాసి గూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఆడపిల్ల పుట్టడంతో వరకట్న వేధింపులు..
76
previous post