80
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ను పురస్కరించుకుని ప్రజలు కరుణ, దయ నుంచి ప్రేరణ పొందాలి. క్రిస్మస్ పర్వదినం ప్రేమ, దయాగుణం విశిష్టతను మరోసారి మనకు గుర్తుచేస్తుంది. మానవాళికి నిస్వార్థంగా ఎలా సేవ చేసి తరించాలో ఈ పండుగ మనకు చాటి చెబుతుంది. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలంటే మనం ఎలాంటి ఆదర్శమయ జీవితం గడపాలో ఏసు క్రీస్తు బోధనలు మనకు విడమరిచి చెబుతాయి. ఇంతటి పర్వదినాన తోటి పౌరులు, ముఖ్యంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాష్ట్రపతి ఆదివారం తన సందేశంలో పేర్కొన్నారు.