వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి

Drone attack on commercial ship

Advertisements

&NewLine;<p>అరేబియా సముద్రంలో 20 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న ఎంవీ కెమ్ ప్లూటో అనే వాణిజ్య నౌకపై శనివారం డ్రోన్ దాడి జరిగింది&period; గుజరాత్‌లోని పోరుబందర్ పోర్టుకు 217 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన ఈ దాడిలో నౌకలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి&period; అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని&comma; దాడికి గురైన షిప్ దిశగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక &OpenCurlyQuote;ఐసీజీఎస్ విక్రమ్‌’ బయలుదేరిందని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు&period; సముద్ర గస్తీ విమానం &OpenCurlyQuote;డోర్నియర్’ రంగంలోకి దిగి దాడికి గురైన ఎంవీ కెమ్ ప్లూటో నౌకతో కమ్యూనికేషన్‌ను అనుసంధానించిందని తెలిపారు&period; దాడికి గురైన ఎంవీ కెమ్ ప్లూటో మర్చంట్ షిప్ సౌదీ అరేబియాలోని ఓ పోర్ట్ నుంచి క్రూడాయిల్‌తో మంగళూరుకు బయలుదేరిందని అధికారులు చెప్పారు&period; ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కోస్ట్ గార్డ్ షిప్ &OpenCurlyQuote;ఐసీజీఎస్ విక్రమ్‌’ దాడికి గురైన ఎంవీ కెమ్ ప్లూటో దిశగా కదిలి వెళ్తోందని అధికారులు వివరించారు&period; దాడికి గురైన నౌక సహాయం అందించాలని ఆ ప్రాంతంలోని నౌకలన్నింటికీ సమాచారం అందించినట్టు వివరించారు&period; అయితే ఎంవీ ఫ్లూటో నౌక 11 నాటికల్ మైళ్ల వేగంతో కదలుతోందని వెల్లడించారు&period; కాగా నౌకల ట్రాకింగ్ కోసం ఉపయోగించే ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను స్విచ్ ఆఫ్ చేశారని అధికారులు తెలిపారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..