60
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడికే రెండవ బొగ్గు గనిపై సీఐటీయు ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల హక్కుల సాధనలో యూనియన్ ముందుండి పోరాటం చేసి అనేక సమస్యలను పరిష్కరించామని అన్నారు. ఈసారి తమకు అవకాశం ఇస్తే సింగరేణి కార్మికుల సొంతింటి కల తో పాటు వృత్తి పన్ను రద్దు చేస్తామన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొత్త బొగ్గు గనుల ఏర్పాటుకు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల అపరిస్కృత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు. ‘ఉదయించే సూర్యుడు’ గుర్తుపై కార్మికులు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.