తెలంగాణలో ఎన్నికల హడావిడి…

Election rush in Telangana

Advertisements

&NewLine;<p>తెలంగాణలో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది&period; రేపు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది&period; ఇప్పటికే పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు&period; ఓటర్లకు స్లిప్పులు పంచడం నుంచి&period;&period; ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత సిబ్బందిని నియమించడం వరకు అన్ని ఏర్పాట్లు చేశారు&period; ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు మొదట్నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంది&period; మరో వైపు…&period; అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిటీ నుంచి సొంతూళ్ల బాట పట్టారు&period; వివిధ జిల్లాలకు వెళ్లేవారు ఒకరోజు ముందుగానే బయలుదేరారు&period; పోలింగ్ సందర్భంగా స్కూళ్లకు నేడు&comma; రేపు రెండు రోజులు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది&period; దీంతో నగరంలోని బస్టాండ్లన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి&period; రెండు మూడు రోజులుగా అడ్డాలపై కూలీలు కూడా పెద్దగా కనిపించలేదు&period; వలస ఓటర్లను సొంతూళ్లకు రావాలని ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు కోరారు&period; కొద్దిరోజులుగా అభ్యర్థులు కూడా సిటీకి వచ్చి తమ సెగ్మెంట్లలోని ఓటర్లతోనూ ఆత్మీయ సమ్మేళనాలు సైతం నిర్వహించారు&period; తప్పకుండా వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సిటీలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన వారు నివసిస్తుంటారు&period; నల్గొండ&comma; ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలకు చెందినవారు ఎక్కువగా ఎల్&ZeroWidthSpace;బీనగర్‌&comma; సాగర్‌ రింగ్ రోడ్‌&comma; బీఎన్‌రెడ్డి నగర్‌&comma; దిల్&ZeroWidthSpace;సుఖ్&ZeroWidthSpace;నగర్ ప్రాంతాల్లో ఉంటారు&period; ఉమ్మడి మహబూబ్ నగర్&comma; రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు మెహిదీపట్నం వైపు&period; వరంగల్‌&comma; కరీంనగర్‌&comma; నిజామాబాద్‌ జిల్లాల వారు ఎల్ బీనగర్&comma; ఉప్పల్ వైపు&period; మెదక్&comma; ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు లింగంపల్లి&comma; బాలానగర్&comma; బోయిన్ పల్లి&comma; సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నివసిస్తుంటారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఈసారి వలస ఓటర్లపై దృష్టి సారించారు&period; డైలీ ఫోన్లు చేసి ఎప్పడొస్తున్నారని ఆయా పార్టీల లోకల్ లీడర్లు అడుగుతున్నారు&period; ఓటర్ల జాబితాల్లోని వివరాలు తెలుసుకుని వారికి ఫోన్లు చేసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు&period; పోలింగ్‌ రోజు వచ్చేందుకు అవసరమైన ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇస్తున్నారు&period; ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కొందరు ఓటర్లను తరలించే పనిలో ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.